బాహుబలి 2 హవా ఇంకా ధియేటర్ల వద్ద తగ్గకముందే శ్రీనివాస్ అవసరాల తన బాబు బాగా బిజీ చిత్రం తో పెద్ద సాహసమే చేశాడు అని చెప్పాలి.
అయితే ఈ సాహసానికి తగిన బహుమతి మాత్రం దక్కలేదు అని థియేటర్ల నుండి వస్తున్న టాక్ బట్టి తెలుస్తుంది. హిందీలో వచ్చిన హంటర్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు అని అర్ధమవుతుంది.
దీనికి గల ముఖ్య కారణం, ఈ సినిమాలో చెప్పిన పాయింట్ అలాగే బోల్డ్ సీన్స్ ఎక్కువంగా ఉండడం కూడా ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం చేస్తుంది. ముఖ్యంగా శ్రీనివాస్ అవసరాల ఇమేజ్ కి ఈ చిత్రంలో కనిపించే ఇమేజ్ కి చాలా వ్యత్యాసం ఉండడం కూడా ఈ సినిమాకి మైనస్ గా మారింది.
బాబు బాగా బిజీ కి వచ్చిన బ్యాడ్ టాక్ కంటే బాహుబలి 2 కి వచ్చిన పాజిటివ్ టాకే BBB పై ఎక్కువగా ఎఫ్ఫెక్ట్ చూపింది.
మొత్తానికి ఈ వారం విడుదలైన బాబు బాగా బిజీ ధియేటర్ల వద్ద ఆడియన్స్ బిజీ ఏ మాత్రం కనపడట్లేదు.