పోయిన సంవత్సరం సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి చిత్రం ఫస్ట్ డే ఓపెనింగ్స్ తో ఒక పెద్ద రికార్డు సృష్టించింది.
అయితే చిత్రం మాత్రం అందరిని ఆకట్టుకోలేకపోయింది. అయితే కబాలి చిత్ర దర్శకుడైన పీఏ రంజిత్ పై ఉన్న నమ్మకంతో రజిని మరో చిత్ర అవకాశం ఇచ్చాడు. అది కూడా రజినీకాంత్ అల్లుడు అయిన ధనుష్ సొంత బ్యానర్ అయిన వండర్ బాల్ ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం నిర్మించనుండడం విశేషం.
ఇక ఈ చిత్ర షూటింగ్ మే 28 నుండి చెన్నైలో ప్రత్యేకంగా వేసిన కాలనీ సెట్లో ప్రారంభం అవ్వనుందట. పవర్ పాండి చిత్రానికి సంగీతం అందించిన సీన్ రోనాల్డ్ అందించానున్నాడట. హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది.
ఈ చిత్రం వచ్చే సంవత్సరం మొదటి బాగంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.