ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- ఫిదా, వైశాఖం & దండుపాల్యం 2

మరిన్ని వార్తలు

ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్ లో మూడు చిత్రాలు పోటిపడుతున్నాయి.

అందులో మంచి హైప్ తో విడుదలైన చిత్రం- ఫిదా. శేఖర్ కమ్ముల ఫిదా చిత్రం మొదటి షో నుండే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి అభినయం ఈ చిత్రానికి హైలైట్ గా చెబుతున్నారు అదే సమయంలో హీరో వరుణ్ తేజ్ చేసిన పరిణితి చెందిన అభినయం అభిమానులని ఆకట్టుకుంది. ఏదేమైనా చాలాకాలం తరువాత శేఖర్ కి ఒక సూపర్ హిట్ వచ్చింది.

ఇక మనకున్న మహిళా దర్శకుల్లో ఒకరైన B జయ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం వైశాఖం. ఈ చిత్రంతో హరీష్, అవంతికా లు వెండితెరకు పరిచయం అయ్యారు. నాది నాది అనుకొంటే దూరం పెరుగుంది - మ‌నం అనుకొంటే అంద‌రం ఒక్క‌టే అనే పాయింట్ చుట్టూ నడిచే కథని వైశాఖం ద్వారా B జయ చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి ఫలితం రాబడుతుందో చూడాలి.

 

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ జాబితాలో మూడవ చిత్రం దండుపాళ్యం-2. ఈ కన్నడ అనువాద చిత్రానికి తెలుగునాట మంచి హైప్ ఉందనే చెప్పాలి. దీనికి కారణం దండుపాళ్యంకి ఇక్కడ మంచి వసూళ్లు రావడమే కారణం. అయితే ఈ చిత్రం మొదటి భాగంతో పోల్చుకుంటే అంత ఇంటరెస్టింగ్ గా లేదు అనే టాక్ వచ్చింది. అయితే నటి సంజన న్యూడ్ గా నటించింది అంటూ తెలియడంతో మొదటిరోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే ఈ చిత్రం తాలుకా ఫలితం కూడా ఈరోజు కలెక్షన్స్ బట్టే తెలుస్తుంది.

ఇక మొదటిరోజు నుండే ఇటు కలెక్షన్స్ పరంగా అటు టాక్ పరంగా కూడా సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఫిదానే ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS