శేఖర్ కమ్ముల ఫిదా సినిమాకి ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు అని ఇప్పుడు ప్రతిచోటా వినిపిస్తున్న మాట!
శేఖర్ కమ్ములకి రెండు చిత్రాల పరాజయం తరువాత ఈ ఫిదాతో మాత్రం సూపర్ హిట్ వచ్చింది. మొదటిరోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 9కోట్ల వసూళ్లు సాదించింది.
ఇక ఇప్పుడిప్పుడే అందుతున్న ట్రేడ్ వివరాల ప్రకారం, ఫిదా రెండో రోజు నైజాంలో రూ 1.4 కోట్ల షేర్ రాబట్టగా, ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రాధాన్ ఏరియాల్లో 0.92కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
మూడవ రోజు సెలవు కావడంతో ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ కలిపి రూ 20 కోట్ల మార్కు దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో శేఖర్ కమ్ముల ఫిదాతో కమర్షియల్ దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.