ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడైన గంటా రవితేజ సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి సంబంధించి చిత్ర రిలీజ్ కి ముందు గ్రాండ్ ఎంట్రీ దక్కిందనే చెప్పాలి.
అయితే ఈ చిత్రానికి సంబందించిన ధియేటర్ టాక్ మాత్రం ఏమాత్రం పాజిటివ్ గా రాలేదు. పైగా రవి యాక్టింగ్ స్కిల్స్ పైన అందరు పెదవి విరుస్తున్నారు. ఎంచుకున్న కథ మంచిదైనప్పటికి ఆ కధకి రవి మాత్రం న్యాయం చేయలేదు అన్నది వినిపిస్తున్న టాక్.
ముఖ్యంగా తమిళ్ చిత్రంలో విజయ్ సేతుపతికి రవికి పోలిక పెట్టేయడంతో అభినయ పరంగా గంటా రవికి చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. కథలో, డైరెక్టర్ లో బలం ఉన్నప్పటికీ కధానాయకుడి సహకారం కొరవడడంతో ఈ చిత్రం మొదటి షోకే కుదేలైన పరిస్థితి.
అయితే మొదటి ప్రయత్నంలో విఫలమై తరువాత నిలదోకుక్కున్న హీరోలు ఎంతో మంది మన ఇండస్ట్రీ లో ఉన్నారు. మరి వారిని ఆదర్శంగా తీసుకుని, ముందుముందు కష్టపడితే, రవికి మంచి కెరీర్ ఉంటుంది అని ఆశించొచ్చు.