ఈ వారం మన ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్ లో ఈ వారం చర్చించుకొబోతున్న చిత్రం- లంక.
ఈ చిత్రం పెద్దగ అంచనాలు లేకున్నప్పటికీ ప్రముఖ నటి రాశి ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నది అనే ఓ చిన్న ఎక్సైట్మెంట్ ప్రేక్షకులని ధియేటర్ల వైపు నడిపించింది.
అయితే ఆ ఎక్సైట్మెంట్ ని మాత్రం దర్శకుడు ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమాలో కొన్ని పోర్షన్స్ బాగున్న మొత్తంగా సినిమా బాగాలేదు అనే టాక్ ని మాత్రం మొదటి షో నుండే తెలిసిపోయింది.
దీనితో పోయిన వారం విడుదలయి హిట్ టాక్ సంపాదించుకున్న శివలింగ చిత్రానికి ప్రేక్షకుల తాకిడి పెరిగింది. ఎలాగు బాహుబలి రిలీజ్ కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకి ఇలాంటి యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు పెద్దగా కిక్ ఇవ్వవు అనేది నిర్వివాదాంశం.
మొత్తానికి లంక అలరించలేకపోయింది అనేది నిజం. సో ఆడియన్స్ లెట్స్ వెయిట్ ఫర్ బాహుబలి 2.