ఈ వారం ప్రేక్షకుల ముందుకి తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెండు చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి నక్షత్రం మరొకటి దర్శకుడు.
ముందుగా నక్షత్రం చిత్రంతో చాలా గ్యాప్ తరువాత వచ్చిన కృష్ణవంశీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. టాలెంటెడ్ యాక్టర్స్ ని సినిమాలో పెట్టుకొని హిట్ కొట్టలేకపోయాడు అన్న పేరుని మూటగట్టుకున్నాడు. కథ, కథనంలో పూర్తిగా విఫలమైన కృష్ణవంశీ, అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రేక్షకులని థ్రిల్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం లేకపోయింది.
ఇక ఈ వారం వచ్చిన మరో చిత్రం- దర్శకుడు. సుకుమార్ నిర్మాణ సంస్థ నుండి వస్తుందన్న నమ్మకంతో ఈ చిత్రం పైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ దర్శకుడు చిత్రంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో రిలీజ్ అయిన మొదటి ఆట నుండే ఫ్లోప్ టాక్ సొంతం చేసుకుంది. హీరో కొత్తవాడు అవ్వడం అందులోని అభినయం పరంగా కూడా మంచి మార్కులు తెచ్చుకోలేకపోవడంతో ఈ చిత్రం ఫ్లోప్ గా మిగిలిపోయింది.
మొత్తానికి ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు మొదటిరోజే బోల్తా పడడంతో ఫిదా చిత్రానికి ఈ వారం కూడా అడ్డు లేకుండాపోయింది. ఇప్పటికే కలెక్షన్స్ పరంగా రూ 60కోట్ల మార్కుని దాటేసినా ఈ చిత్రం మరికొన్ని కోట్లు కొల్లగొట్టే ప్రయత్నంలో ఉంది.
చివరికి ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టులేకపోయాయి.