సినిమాల్లో హిట్ పెయిర్ అంటూ కొంతమంది హీరో-హీరోయిన్ ల జంటలకి ఆ ముద్ర పడుతుంది. అందులో ఒకరే నిఖిల్-స్వాతి ల జంట. చాలా కాలంగా వీరి మధ్య ఎదో ఉంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాల తరువాత ఈ పుకార్లకీ హీరో నిఖిల్ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ మధ్యనే తను ఒక టాక్ షోలో మాట్లాడుతూ- నాకు స్వాతికి మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమే, అలాగే ప్రస్తుతం స్వాతికి పెళ్ళీ సంబందాలు చూస్తున్నారు. ఇటువంటి సందర్భంలో లేనివి ఉన్నవి రాసి అనవసరంగా లేనిపోనిది సృష్టించకండి అని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.
దీనితో వీరి మధ్య ఏదో ఉందంటూ వచ్చిన వార్తలు ఓట్టి పుకార్లే అని తేలిపోయింది. ఈ టాక్ షో లో నిఖిల్ తో పాటు దర్శకుడు చందు కూడా పాల్గొన్నారు.