ఈ శుక్రవారం మన ముందుకి రెండు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాయి. అయితే రామ్ గోపాల్ వర్మ తీసిన సర్కార్ 3 కూడా ఈ వారమే రిలీజ్ అయింది.
దీనితో టెక్నికల్ గా తెలుగు సినిమాలు రెండు (వెంకటాపురం & రాధ) అయినా ఆర్జీవీ కి తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ కారణంగా సర్కార్ 3 కుడా పోటిలో నిలిచింది.
ఇక మొదట హ్యాపీ డేస్ ఫేం రాహుల్ చాలా కాలం తరువాత చేసిన చిత్రం వెంకటాపురం. ఈ చిత్రం పై రిలీజ్ కి ముందు నుండే పాజిటివ్ టాక్ ఉంది, అదే టాక్ రిలీజ్ అయ్యాక కూడా కంటిన్యూ అవుతుంది. ఈ చిత్రానికి రోజురోజుకి స్క్రీన్స్ పెరుగుతుండడం విశేషం.
రెండవ చిత్రం శర్వానంద్ నటించిన రాధ, వరుస హిట్స్ తో మంచి ఊపుమీద ఉన్న శర్వానంద్ కి తన పాత చిత్రాలకు వచ్చినంత పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. అయితే శర్వానంద్ నటన ఒక్కటే ఈ చిత్రాన్ని కాపాడొచ్చు అన్న టాక్ వినపడుతున్నా, ప్రేక్షకులు అంచనాలను మాత్రం ఇది అందుకోలేకపోయింది.
ముచ్చటగా మూడవ చిత్రం - సర్కార్ 3. ఆర్జీవీ నుండి వచ్చిన ఈ చిత్రంపై ఆయన ఫ్యాన్స్ పెద్ద అంచనాలే పెట్టుకున్నారు. అయితే సినిమా బాగానే వచ్చినా సర్కార్ & సర్కార్ రాజ్ లకి వచ్చినంత రెస్పాన్స్ మాత్రం కరువయ్యింది. దీని భవిష్యత్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రిపోర్ట్ బట్టే డిసైడ్ అవుతుంది.
ఇక ఈ మూడు సినిమాల్లో ఇటు టాక్ పరంగానే కాకుండా అటు కలెక్షన్స్ పరంగా కుడా మంచి వసూళ్ళు రాబడుతున్న వెంకటాపురం చిత్రం ఈ వారం విన్నర్ అని చెప్పొచ్చు.