అందాల 'గీత' దాటేసింది.!

By iQlikMovies - September 01, 2018 - 18:05 PM IST

మరిన్ని వార్తలు

వర్మ మెచ్చిన అందమంటే ఆషామాషీ కాదు. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆఫీసర్‌' సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ మిరా సరీన్‌ గురించి వర్మ ఓ రేంజ్‌లో పొగిడేశారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మకు ఆ పొగడ్తలు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. ఆ ముద్దుగుమ్మే 'ఇరా'. 'భైరవగీత' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోన్న హాట్‌ భామ ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది మరెవరో కాదు, ఆయన శిష్యుడే. అందుకే ఈ సినిమాలో హీరోయిన్‌ని ఆయన అంతగా పొగిడేస్తున్నారు. చాలా చాలా బాగా నచ్చేసిందట ఇరా మన వర్మ గారికి. ఈ మధ్య కాలంలో ఇలాంటి అందం, అభినయం ఉన్న హీరోయిన్‌ని చూడలేదన్నంతగా వర్మగారు ఇరాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వర్మ చేత పొగిడించుకోవడమంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా పెట్టి పుట్టాలంతే. ఆ అదృష్టం లేటెస్టుగా ఈ భామకు దక్కేసింది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS