గ్లామ్‌షాట్‌: గ్లామర్‌ ఫోన్‌ పట్టిన వర్మ గారి హీరోయిన్‌.!

By iQlikMovies - December 12, 2018 - 13:12 PM IST

మరిన్ని వార్తలు

'భైరవగీత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది ముద్దుగుమ్మ ఇరా మోర్‌. వర్మ కంపెనీ నుండి దిగుమతి అయిన ముద్దుగుమ్మే ఈ హాట్‌ అందాల భామ. వర్మగారి హీరోయిన్స్‌ అందరికీ హాట్‌ అప్పీల్‌ కాస్త ఎక్కువే. ఈ బ్యూటీ కూడా అదే ఆటిట్యూడ్‌తో ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో హీరోగారితో కలిసి హాట్‌ హాట్‌ హగ్గింగులు, గాఢమైన లిప్‌లాక్‌లు.. అహో.! ఓ రేంజ్‌లో ఇరగదీసేసిందిలెండి.

ఆల్రెడీ కన్నడలో ఈ బ్యూటీ అందాలు పరిచయమైపోయాయి. 'భైరవగీత' సినిమా కన్నడలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. తెలుగులో ఈ నెల 14న విడుదల కానుంది. సినిమాతో సంబంధం లేకుండా ఇప్పుడు ముద్దుగుమ్మలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌పై గ్లామర్‌ దాడితో చిన్నపాటి యుద్దమే చేస్తున్నారులెండి.

అలా ఆ యుద్ధంలో గెలిచి అవకాశాల బాట పడుతున్నవారు కొందరైతే, అదే సోషల్‌మీడియాలో ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ అక్కడే సెటిలైపోయినవారు కొందరుంటున్నారు. మరి ఈ హాట్‌ బ్యూటీ ఏ బాటలోకి వెళుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS