కేసీఆర్‌ ముందు హీరోలంతా బలాదూర్‌ - ఆర్జీవీ

By iQlikMovies - December 12, 2018 - 12:43 PM IST

మరిన్ని వార్తలు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కంటే 20 రెట్లు, తెలుగు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కంటే 200 రెట్లు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే 2000 రెట్లు కేసీఆర్‌ గొప్పోడనీ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో పేర్కొనడం మరింత సంచలనంగా మారింది. కేటీఆర్‌ని ఉద్దేశించి ఈ ట్వీట్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. దానికి కేటీఆర్‌ బదులిస్తూ.. 'ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు.. మీరు తెలుసుకోవడానికి ఇంత టైం పట్టిందా..' అని ట్వీటేశాడు.

మరోపక్క హీరోయిన్స్‌ అందరి కంటే కేసీఆర్‌ అందగాడనుకున్నాను. హీరోలందరికంటే అందగాడనీ, హిమాలయాల కంటే ఆకర్షణీయ వ్యక్తి అనీ తెలుసుకున్నాను. తెలంగాణా సమాజం కేసీఆర్‌కి అతి పెద్ద విగ్రహం పెట్టాల్సి వస్తుంది.. అన్నారు. రామ్‌గోపాల్‌ వర్మకి చంద్రబాబు అంటే అదో ఇది. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా చంద్రబాబుకు వ్యతిరేకంగా రూపొందుతున్నదే. ఆ సినిమా విషయమై వర్మపై టీడీపీ నానా యాగి చేస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణా గడ్డపై మరోమారు బంపర్‌ విక్టరీ కొట్టిన టీఆర్‌ఎస్‌ని అభినందిస్తూ, వర్మ ట్వీట్ల పరంపర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, వర్మ నిర్మాణంలో రూపొందుతోన్న 'భైరవగీత' సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధనుంజయ్‌, ఇరా మోర్‌ జంటగా సిద్దార్డ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS