విశాల్‌ డైరెక్టర్‌తో కార్తీ

మరిన్ని వార్తలు

ఇటీవలే 'ఇరుంబుతిరై' సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు తమిళ హీరో విశాల్‌. ఈ సినిమా తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో ఇటీవల విడుదలైంది. ఇక్కడ కూడా మంచి టాక్‌ సంపాదించుకుందీ చిత్రం. కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌ మిత్రన్‌ కార్తీ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. 

ఈ కథను కార్తీకి చెప్పమని సూచించింది విశాలేనట. ఈ ఇద్దరూ రియల్‌ లైఫ్‌లో మంచి స్నేహితులు. అందుకే తన స్నేహితుడి కోసం ఈ ప్రాజెక్టును సూచించాడు విశాల్‌. ఈ స్టోరీ లైన్‌ కార్తీకి కూడా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేశాడట. కార్తీ ప్రస్తుతం నటిస్తున్న ఓ చిత్రం ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది. 'కడైకుట్టి' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కార్తి రైతు పాత్రలో నటిస్తున్నాడు. కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి ఈ సినిమాపై. మరోవైపు కొత్త దర్శకుడు రజిత్‌తో ఓ సినిమా చేస్తున్నాడు కార్తి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. 

కాగా ఇప్పుడు మిత్రన్‌తో కార్తీ చేయబోతున్న సినిమాలో హీరో విశాల్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది. సినిమాకి అత్యంత కీలక పాత్రట ఈ సినిమాలో విశాల్‌ది. కార్తీ కోసమే ఈ పాత్ర చేసేందుకు విశాల్‌ ఒప్పుకున్నాడనీ తెలుస్తోంది. కార్తీకి తెలుగులోనూ అభిమానులున్నారు. 

తమిళ హీరో అయినా కానీ తెలుగులోనూ విశాల్‌కి క్రేజ్‌ ఉన్నప్పటికీ, ఇంతవరకూ తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయలేకపోయాడు. కానీ కార్తి కెరీర్‌ తొలి నాళ్లలోనే నాగార్జునతో 'ఊపిరి' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల అపారమైన అభిమానం పొందగలిగాడు. ఇప్పుడీ స్నేహితులిద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్న ఈ తాజా చిత్రం అతి త్వరలోనే సెట్స్‌ మీదికెళ్లనుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS