మూలిగే నక్కపై తాటి కాయ పడినట్టు,... అసలు ఫ్లాపైన సినిమాపై ఇప్పుడు కాపీ ముద్ర కూడా పడిపోయింది. ఆసినిమా మరేదో కాదు... మిస్ ఇండియా. కీర్తి సురేష్ నటించిన చిత్రమిది. ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమాని నెగిటీవ్ రివ్యూలు వెంటాడాయి. మొత్తంగా ఓ టీ టీలో మరో భారీ ఫ్లాప్ గా నమోదైంది. అయితే ఇది సొంత కథ కాదని, కాపీ కథ కథ అని మరో మాట బలంగా వినిపిస్తోంది. ఓ సామాన్య యువతి.. అమెరికాలో టీ అమ్మి - పెద్ద వ్యాపార వేత్తగా మారడం మిస్ ఇండియా కథ.
అయితే.. ఈ కథ బ్రూక్ ఎడ్జీ అనే ఓ అమెరికన్ మహిళ జీవిత కథ అని టాక్. తనకి భారతదేశం అంటే చాలా ఇష్టం. ఇక్కడి జీవితాల్ని, వాతావరణాన్నీ, రుచుల్ని పూర్తిగా అధ్యయనం చేసింది. ఇక్కడ దొరికే టీ.. అమెను అమితంగా ఆకర్షించింది. దాంతో.. అమెరికాలో... భక్తి చాయ్ పేరుతో ఓ బ్రాండ్ స్థాపించి, వ్యాపారం మొదలెట్టింది. తన కథనే... అటూ ఇటూ మార్చి `మిస్ ఇండియా`గా తీశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం.. ఆమె పేరుని టైటిల్ కార్డులో గుర్తు చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా హిట్టయితే కాపీ రైట్ గొడవ ఈ పాటికే మొదలైపోయేది. ఫ్లాప్ సినిమా కదా. అందుకే గొడవ పెద్దది కావడం లేదు. అదీ మేటరు.