నమ్రత సెకండ్ ఇన్నింగ్స్ నిజమేనా?

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్, నమ్రత జోడికి టాలీవుడ్ లో మంచి పేరుంది. వీరిద్దరూ చాలా మందికి ఆదర్శ జంట. మిస్ ఇండియా, స్టార్ హీరోయిన్ వీటన్నిటిని పక్కన పెట్టి, అహం అన్న మాట మరిచి భర్త చాటు భార్యగా మెలిగింది. బాలీవుడ్ లో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి, అందాల కిరీటాలు గెల్చుకుని, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1998లో జబ్ ప్యార్ కిసీసే హోతా హై నమ్రత మొదటి సినిమా, తక్కువ కాలంలోనే అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపుపొంది, తెలుగులో కూడా చిరంజీవి, మహేష్ లతో కలిసి నటించింది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని వారి బాధ్యతలు చూసుకుంటూ, భర్త మనసెరిగిన ఇల్లాలుగా నడుచుకుంది.


ఇన్నాళ్లలో నమ్రత సెకండ్ ఇన్నింగ్స్ గూర్చి ఎలాంటి ఆలోచన చేయలేదు. కనీసం ఆమె రీఎంట్రీ పై వార్తలు కూడా రాలేదు. కానీ 20 ఏళ్ల తర్వాత నమ్రత రీ ఎంట్రీ పై ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరలవుతోంది. ప్రముఖ ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరో సినిమాలో నమ్రత కీలక పాత్రలో నటించనుందని టాక్. అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని ఫిలిం నగర్ టాక్. అదిగో పిలి అంటే ఇదిగో తోక అన్నట్టు అది కచ్చితంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మూవీ అయి ఉంటుందని గెస్సింగ్ లు మొదలు పెట్టారు సినీప్రియులు.   


మొత్తానికి నమ్రత ఇన్నాళ్ళకి రీఎంట్రీ ఇస్తోందని మహేష్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొందరు వెల్ కమ్ బ్యాక్ మేడమ్ అంటూ కామెంట్లు పెడుతుండగా.  మరికొందరు ఇది ఫేక్, నిజమైతే బాగుణ్ణు అని స్పందిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు క్రేజీ ఆఫర్లు వచ్చినా నో చెప్పిన నమ్రత, తనకు మ‌ళ్లీ సినిమాల్లో యాక్ట్ చేయాల‌నే ఆస‌క్తి లేద‌ని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఇప్పుడు నిర్ణయం మార్చుకుందో లేక, పుకార్లో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS