ప్రస్తుతం టాలీవుడ్ లో ఊర్వశీ రౌటేలా హాట్ టాపిక్ గా మారింది. వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంద మూవీల్లో స్పెషల్ సాంగ్స్‌తో కుర్ర కారుకి గిలిగింతలు పెట్టింది. ఇప్పటివరకు తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన ఊర్వశీ మొదటిసారిగా హీరోయిన్ గా నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబో మూవీలో ఒక కీలక పాత్రలో ఊర్వశీ కనిపిస్తోంది. ఈ మూవీ దసరా బరిలోకి రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే షూటింగ్ చకచకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఊర్వశి తో పాటు పలువురు ముఖ్య నటీనటులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ఒక యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ఊర్వశికి ప్రమాద జరిగినట్లు, ఆ ప్రమాదం లో కాలికి గాయాలు అయ్యాయని టాక్. వెంటనే అలర్ట్ అయిన చిత్ర యూనిట్ ఆమెను హాస్పటల్ కి తరలించి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారని సమాచారం. ఈ ప్రమాదంలో ఊర్వశి కి కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. అఫీషయల్ గా మూవీ టీమ్ నుంచి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కానీ బాలయ్య మూవీలో ఊర్వశి కి ప్రమాదం జరగటం, గాయ పడటం నిజమని తెలుస్తోంది.
ఈ విషయం తెలిసిన ఊర్వశి ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఇప్పటివరకు ఐటెం గాళ్ గా ముద్ర పడిన ఈ అమ్మడు మొదటిసారిగా హీరోయిన్ గా నటిస్తుంటే ఇలా జరిగిందేంటని వాపోతున్నారు. ఈ మూవీతో ఊర్వశి మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందని ధీమాగా ఉన్న ఫాన్స్ ఇంతలోనే ఇలా జరిగిందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నారు.