సాయి తేజ్ పెళ్లి ఆ హీరోయిన్ తోనా?

మరిన్ని వార్తలు

ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమలకి చెందిన నటీ నటులు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. గత ఏడాదిలో మొదలయిన ఈ పెళ్ళిళ్ళ హడావిడి ఈ ఇయర్ లో ఎక్కువయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి, కృతి కర్బందా, లాంటి వారు ఇప్పటికే పేళ్ళిచేసుకోగా, వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్ధం చేసుకుని పెళ్ళికి రెడీగా వుంది. ఈక్రమంలోనే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయి ధర్మ తేజ్ పెళ్లి న్యూస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవును... గతం లో సాయి తేజ్ నడిపిన ఒక ప్రేమాయణం మళ్ళీ తెర మీదకి వచ్చింది. 


హీరో, హీరోయిన్స్ కలిసి నటించేటప్పుడు వారి మధ్య ఏదో ఉంది అనే పుకార్లు రావటం సహజం.  అదే కాంబినేషన్ ఎక్కువసార్లు రిపీట్ అయితే కచ్చితంగా వారి మధ్య ఎదో ఉంది అని కన్ఫర్మ్ చేసేస్తారు గాసిప్ రాయుళ్ళు. అలాంటిదే సాయి తేజ్, రెజీనా లవ్ స్టోరీ. సాయి తేజ్ సెకండ్ సినిమా పిల్ల నువ్వు లేని జీవితం. ఈ సినిమాలో మొదటిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన స్నేహం తరవాత ప్రేమగా మారింది అనేది టాక్. ఈ రూమర్లకు తగ్గట్టుగానే నెక్స్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నక్షత్రం అనే రెండు సినిమాల్లో కలిసి నటించింది ఈ జోడీ. 


అప్పటిలో వీరిద్దరి లవ్ స్టోరీ గూర్చి మీడియా కథలు కథలుగా రాసింది. కానీ వీళ్లు ఎప్పుడు వీటిని ఖండించలేదు. తరవాత పెళ్లి అన్నారు. బ్రేకప్ అన్నారు. వేటికీ వీరి నుంచి వివరణ లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి  పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం. ఇప్పటికే మెగా హీరోలు చెర్రీ, వరుణ్, బన్నీ లు పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కి చెక్ పెట్టారు. నెక్స్ట్ సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ , అల్లు శిరీష్ లైన్ లో ఉన్నారు. సాయి తేజ్, రెజీనా పెళ్లి వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS