గేమ్ చేంజర్ సినిమా కోసం మెగా ఫాన్స్ తో పాటు, సినీప్రియులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కారణం RRR తరవాత రామ్ చరణ్ నుంచి వస్తున్న మూవీ ఇదే కావటం విశేషం. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్గా నటిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో మొదలయ్యింది. కానీ ఇప్పటివరకు రిలీజ్ కి నోచుకోలేదు, సరైన అప్డేట్స్ రావటం లేదని మెగా ఫాన్స్ కొన్నాళ్ళు అసహనం వ్యక్తం చేశారు. చివరికి చేసేదేం లేక విసిగి ఊరుకున్నారు. ఎట్టకేలకు గేమ్ చేంజర్ షూటింగ్ ముగింపుకి వచ్చిందని సమాచారం. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతోంది.
శంకర్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు, భారతీయుడు తరహాలో ఈ మూవీ కూడా పొలిటికల్ కమర్షియల్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని తెలుస్తోంది. రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో పొలిటీషియన్ గా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి, కొడుకులుగా చెర్రీ ద్విపాత్రాభినయం చేయనున్నారు. రెండు డిఫరెంట్ పాత్రల్లో చెర్రీ నట విశ్వరూపం చూడొచ్చు. 2024 చివరకి ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇప్పుడు మొదలైన పాన్ ఇండియా ట్రెండ్ మొదలు పెట్టిందే శంకర్. శంకర్ అన్నీ సినిమాలు మిగతా భాషల్లో కూడా రిలీజ్ అయ్యి శంకర్ కి మంచి గుర్తింపు వచ్చింది. మొట్ట మొదటిసారిగా శంకర్ ఒక తెలుగు హీరోతో సినిమా చేస్తుండటం చెప్పుకో దగిన విషయం. RRR సినిమా తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పేరు పొందటంతో శంకర్ కూడా చెర్రీ తో వర్క్ చేయటానికి ముందుకు వచ్చాడు. చెర్రీ నటిస్తుండటంతో గేమ్ చేంజర్ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్ కూడా బాగా పెరిగింది. ప్రజంట్ హిందీలో ఈ మూవీ రైట్స్ కోసం చాలా పోటీ ఏర్పడింది. భారీ పోటీ మధ్య 'అనిల్ తడాని' ఈ రైట్స్ ని 75 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఒక సౌత్ హీరో, సినిమా కోసం హిందీ థియేటర్స్ రైట్స్ 75 కోట్లు పెట్టటం అంటే ఎక్కువే. RRR లో అల్లూరి క్యారెక్టర్ లో నార్త్ ఇండియన్స్ ని ఆకట్టుకున్న చెర్రీ గేమ్ చేంజర్ తో మళ్ళీ లాభాల బాట పట్టిస్తాడని నమ్మకంతో ఇన్ని కోట్లు వెచ్చించ్చి నట్లు టాక్.