నిధి, నభాతో 'రాపో' అదిరింది!

మరిన్ని వార్తలు

'రాపో' అంటే రామ్‌ పోతినేని. తన పేరును 'రాపో' అని మెన్షన్‌ చేస్తుంటాడు రామ్‌. రామ్‌ హీరోగా తాజా తెరకెక్కుతోన్న చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'. పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుండి లేటెస్ట్‌గా ఓ స్టిల్‌ రిలీజైంది. ఇద్దరు హీరోయిన్స్‌తో సాగే సాంగ్‌కి సంబంధించిన స్టిల్‌ ఇది. ఇద్దరు ఇస్మార్ట్‌ గాళ్స్‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ల మధ్య రామ్‌ పోతినేని ఇస్టైల్‌గా ఉన్న స్టిల్‌ అది. నిధి నడుంపై రామ్‌ సుతారంగా చేయి వేస్తే, తన నడంపై తానే ఓ చెయ్యి వేసుకుని, ఇంకో చేతిని రామ్‌ భుజంపై వేసి నిలబడింది నభా నటేష్‌.

 

ఈ స్టైలింగ్‌ చూస్తుంటే, రామ్‌ గతంలో నటించిన తూగోజిల్లా.. పిల్లా.. పగోజిల్లా పాట గుర్తుకొస్తోంది. ఆ పాటలో బిందుమాధవి, ప్రియా ఆనంద్‌లతో రామ్‌ రెచ్చిపోయి ఇలాగే మాస్‌ స్టెప్పులేశాడు. అయితే ఇస్మార్ట్‌ శంకర్‌ మరీ ఊరమాసు. గెటప్‌ చూస్తున్నారుగా, లుంగీ ఎగ్గట్టి, ఇద్దరు హాట్‌ పాపలతో ఎలా పండిస్తున్నాడో కెమిస్ట్రీ. ఇక ఇద్దరు భామల విషయానికి వస్తే, ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉంది. స్టైలింగ్‌లో ఛార్మి కళ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకి తెర వెనక తతంగమంతా ఛార్మిదే కదా నిర్మాణ భాగస్వామిగా. నిధి అగర్వాల్‌ హాట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. నభా నటేష్‌ మాత్రం ఈ సినిమా కోసం కొంచెం, సారీ కొంచెమేంటీ.? కాస్త ఎక్కువే హాట్‌ యాంగిల్‌ ప్రదర్శించింది. ఈ స్టిల్‌ పరంగా చూస్తే, ఇస్మార్ట్‌ శంకర్‌లో ఇద్దరు భామలూ ఓ రేంజ్‌లో అందాల ఆరబోసేశారనే అనిపిస్తోంది. అసలే మన శంకర్‌ మాస్‌, ఊరమాస్‌. ఇక అమ్మాయిలు కూడా ఇలాగే ఉంటే, సినిమా ఊరమాస్‌ హిట్‌ అవ్వడం ఖాయమేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS