బన్నీ సినిమాకి ఒక్కొక్కరుగా స్టార్ కాస్టింగ్ యాడ్ అవుతోందనిపిస్తోంది. ఇప్పటికే పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది. టబు ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. తాజాగా సుశాంత్ వచ్చి చేరాడు. మరీ లేటెస్ట్గా ఇంకో స్టార్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా జాయిన్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు, నివేదా పేతురాజ్. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. పలు తమిళ చిత్రాల్లో నటించింది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి'తోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ పేరు బన్నీ సినిమా కోసం ప్రచారంలో ఉంది.
త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు వెరీ వెరీ కామన్. అలా మెయిన్ హీరోయిన్‌తో పాటు, ఓ మోస్తరు స్టార్డమ్ దక్కించుకునే అవకాశం ఉంటుంది రెండో హీరోయిన్ కూడా. గత చిత్రాలను తీసుకుంటే, ప్రణీత, ఆదాశర్మ, తెలుగమ్మాయి ఈషారెబ్బ.. ఇలా చాలా మంది ముద్దుగుమ్మలకు త్రివిక్రమ్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ దక్కాయి. ఈ సారి ఆ ఛాన్స్ నివేదాకి దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నివేదా మంచి నటి. ఆమె టాలెంట్‌ని త్రివిక్రమ్ బాగానే ఉపయోగించుకుని ఉండుంటాడు. ఇక 'డీజె' తర్వాత రెండోసారి పూజాహెగ్దే, అల్లు అర్జున్‌తో జత కడుతోంది.
ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతోన్న షూటింగ్ షెడ్యూల్లో పూజా హెగ్దే కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే, నివేదా విషయమై చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ క్లారిటీ లేదు, కానీ, ఆమె పాత్ర ఈ సినిమాలో ఖచ్చితంగా ఉండే ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమన్ బాణీలు సమకూరుస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్‌తో కలిసి చినబాబు నిర్మిస్తున్నారు.