పూరీ జగన్నాధ్ తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ గోవాలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. గోవా షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని చెబుతూ చిత్ర యూనిట్ సరదాగా దిగిన కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఛార్మి, నిధి అగర్వాల్, రామ్, పూరీ జగన్నాధ్ తదితరులు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. ఛార్మి ఈ సినిమాలో యాక్ట్ చేయడం లేదు. కానీ తెర వెనక కర్త, కర్మ అంతా తానే. సినిమాకి సంబంధించిన ఫ్రెష్ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
ఇలా అప్‌డేట్స్ అందించడంతోనే 'ఇస్మార్ట్ శంకర్'పై ఇప్పటికే బీభత్సమైన హైప్ తీసుకొచ్చేశారు. అసలు వివరాల్లోకి వెళితే, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోపై నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. హీరోయిన్ నిధి అగర్వాల్, ఛార్మి ధరించిన కాస్ట్యూమ్స్‌పై నెటిజన్లు గుస్సా అవుతున్నారు. అసలే గోవాలో షూటింగ్. గోవా అంటేనే ఓ ఐడియా ఉంది జనానికి. ఇక ఇస్మార్ట్ టీమ్ పోస్ట్ చేసే ఫోటోలు చూస్తుంటే, వీళ్లు సినిమా షూటింగ్‌కే వెళ్లారా.? లేదా ఇంకేదైనా ఎంజాయ్‌మెంట్ కోసం వెళ్లారా.? అంటూ నెటిజన్లు పెడార్ధాలు తీస్తున్నారు.
అయినా సినిమా షూటింగ్స్‌లో ఇవన్నీ కామన్. అందులోనూ ఇస్మార్ట్ బ్యాచ్ ఆయే. మరి ఎంజాయ్‌మెంట్ ఇంత ఇస్మార్ట్‌గా ఉండకుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి బాస్.