అది కూడా ఇస్మార్ట్‌గానే ప్లాన్‌ చేశావా పూరీ!

మరిన్ని వార్తలు

ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేయబోతున్నారట. అయితే, ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పూరీ ఓ ఇస్మార్ట్‌ పేరును సెలెక్ట్‌ చేశారు. ఆషాఢం సందర్భంగా హైద్రాబాద్‌ అంతా బోనాల జాతరతో మార్మోగిపోతుంటుంది.

 

ఈ టైంలో విడుదల కాబోతున్న అసలు సిసలు హైద్రాబాదీ నేపధ్యమున్న సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి మరింత క్రేజ్‌ తెచ్చేలా పూరీ ప్లాన్‌ చేశాడు. 'ఇస్మార్ట్‌ శంకర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి 'బోనాల జాతర' అని నామకరణం చేశాడు. అంతేకాదు, పబ్లిక్‌ ఈవెంట్‌గా ఈ ఫంక్షన్‌ నిర్వహించబోతున్నాడట పూరీ. ఇక్కడ అంతా బోనాల వాతావరణమే కనిపించేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఈ నెల 7న జరగబోయే పూరీ 'బోనాల జాతర'కు హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట.

 

ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని పూరీ ఆలోచనట. అందుకే ఇంత గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం రామ్‌ పాత బస్తీ కుర్రోడిలా మాస్‌, ఊరమాస్‌ లుక్స్‌తో భాషా, యాసా అంతా మార్చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్‌ శంకర్‌' ట్రైలర్‌కి ఇస్మార్ట్‌ రెస్పాన్స్‌ వచ్చింది. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హాట్‌ హాట్‌ అందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌తో కలిసి ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS