ఇస్మార్ట్‌.. నిర్మాత కూడా టూ హాట్‌

By iQlikMovies - July 01, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు హాట్‌ హాట్‌గా షురూ అయ్యాయి. ఆడియో సింగిల్స్‌తో, టీజర్‌తో స్టార్ట్‌ అయిన ప్రమోషన్స్‌, ముందు ముందు మరింత అగ్రెసివ్‌గా మారబోతున్నాయి. ఇదిలా వుంటే, నాలుగు ఆడియో సింగిల్స్‌ సూపర్‌ హిట్‌ అవడంతో నిర్మాతల్లో ఒకరైన మాజీ హీరోయిన్‌ ఛార్మి కౌర్‌ ఆనందానికి అవధుల్లేవు.

 

సెట్స్‌లో ఛార్మి చాలా హంగామా చేసేస్తోందట. ఆ హంగామాని సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తోన్న విషయం విదితమే. తాజాగా ఛార్మి రిలీజ్‌ చేసిన తన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందుక్కారణం, ఆ ఫొటోల్లో ఛార్మి చూపిస్తున్న 'ఇస్మార్ట్‌' గ్లామరే. నిజానికి 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో గ్లామర్‌ ఓవర్‌ డోస్‌ అయిపోయిందని ఇప్పటిదాకా విడుదల చేసిన ప్రోమోస్‌ని, స్టిల్స్‌ని చూస్తే అర్థమవుతుంది.

 

హీరోయిన్లు నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ అవసరానికి మించి అందాల విందు చేసేశారని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ గ్లామర్‌కి తోడు, ఇప్పుడు ఛార్మి కూడా తన హాట్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేస్తోంది. 'ఇస్మార్ట్‌ ప్రొడ్యూసర్‌.. టూ హాట్‌..' అంటూ సోషల్‌ మీడియాలో ఛార్మి అభిమానులు ఓ రేంజ్‌లో సందడి చేసేస్తున్నారు ఆమె ఫొటోలతో. పూరి జగన్నాథ్‌తో కలిసి ఛార్మి ఈ 'ఇస్మార్ట్‌ శంకర్‌'ని నిర్మిస్తోన్న విషయం విదితమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS