సందీప్‌కిష‌న్‌ని అవ‌మానించిన నిర్మాత ఎవ‌రు?

By iQlikMovies - July 01, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

చిత్ర‌సీమ‌లో హిట్లూ, ఫ్లాపులే కెరీర్‌ని నిర్దేశిస్తాయి. హిట్లు ప‌డితే అంతా స‌వ్యంగానే న‌డుస్తుంది. ఒక‌ట్రెండు ఫ్లాపులు రాగానే ప‌క్క‌న పెట్టేస్తారు. సందీప్‌కిష‌న్‌కి కూడా అలానే ఫ్లాపులు ప‌డ్డాయి. కానీ తేరుకుని నిర్మాత‌గా మారి.. ఓ సినిమా తీశాడు. అదే.. 'నిను వీడ‌ని నీడ‌ను నేనే'. త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతంది. అయితే... వ‌రుస ఫ్లాపుల వ‌ల్ల సందీప్‌పై న‌మ్మ‌కాలు త‌గ్గిపోయాయి. త‌న మార్కెట్ కూడా ప‌డిపోయింది.

 

నిర్మాత‌లూ ధైర్యం చేయ‌డం లేదు. ఓ నిర్మాత అయితే సందీప్‌ని దారుణంగా అవ‌మానించాడట‌. సందీప్ మేనేజ‌ర్ల ద‌గ్గ‌ర 'సందీప్ గురించి మాట్లాడ‌డం ఎందుకు? అత‌ని ప‌ని అయిపోయింది క‌దా' అంటూ తేలిగ్గా మాట్లాడాడ‌ట‌. ఈ విష‌యాన్ని సందీప్ కిష‌నే చెప్పుకొచ్చాడు. `నిను వీడ‌ని నీడ‌ను నేనే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఎదురైన ఈ చేదు ఘ‌ట‌న‌ని గుర్తు చేసుకున్నాడు సందీప్ కిష‌న్‌.

 

అలా త‌న‌ని అవ‌మానించిన నిర్మాత‌పై త‌న‌కు ఎలాంటి కోపం లేద‌ని, ఆ క‌సితోనే ఈ సినిమా తీశాన‌ని చెప్పుకొచ్చాడు సందీప్. అంతే కాదు.. ఆ నిర్మాత‌కు థ్యాంక్స్ కూడా చెప్పాడు. `నిను వీడ‌ని నీడ‌ని నేనే` ఎలాగైనా హిట్ చేయాల‌న్న క‌సి... ఆ నిర్మాత మాటల వ‌ల్లే క‌లిగింద‌ట‌. ఆ నిర్మాత ఎవ‌రో గానీ - సందీప్ కి ఈ ర‌కంగా ప్రేర‌ణ క‌లిగించాడు. మ‌రి సందీప్ క‌సికి త‌గిన ఫ‌లితం వ‌స్తుందో రాదో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS