ఇస్మార్ట్‌ గాళ్స్‌ హంగామా మామూలుగా లేదండోయ్‌!

మరిన్ని వార్తలు

హీరోయిన్స్‌ని చూసి ఆడియన్స్‌ సినిమాలకు వచ్చే పరిస్థితి లేదంటే తప్పులో కాలేసినట్లే. మన పూరీ సినిమాల్లో హీరోయిన్స్‌ని చూసి ఎవరైనా సినిమాకి రాకుండా ఉండగలరా.? చెప్పండి. అయితే, ఆయన గత చిత్రాలు వేరు. తాజా చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌' వేరు. ఈ సినిమాకి హీరోయిన్సే ఫస్ట్‌ ప్లస్‌ పాయింట్‌ అనేలా ప్రమోషన్స్‌ హడావిడి జరుగుతోంది. ఇద్దరు భామలు.. ఇద్దరూ ఇద్దరే గ్లామర్‌లో పీక్స్‌కి వెళ్లిపోయారు.

 

అసలీ ఇద్దరి భామల్లో ఇన్ని గ్లామర్‌ నిధులున్నాయా.? అని ఆశ్చర్యపోయేంతలా పూరీ ఆ నిధుల్ని ఏరి పెట్టేశారు. పాపం పాపలు కూడా ఏమాత్రం మొహమాటపడకుండా, కూల్‌ సీజన్‌లో హాట్‌ హాట్‌గా అందాల్ని వండి వడ్డించేశారు. వంటకం బాధ్యత పూరీదేలెండి. పాపలు వాటిని వేడిగా ఆరేసేశారంతే. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు, ఐటెం సాంగ్‌లో మెరిసిన మరో హాట్‌ భామను మర్చిపోతున్నారండోయ్‌. మర్చిపోయే అందం కాదు ఆ ముద్దుగుమ్మది. పేరు లేఖ ప్రజాపతి. ఈ పాప ఇన్‌స్టాగ్రాం చూస్తే, అమ్మో పాప ఇంత హాటా.? అని ముక్కున వేలేసుకుంటారు. సినిమా చూశాకా పాపలోని హాట్‌ యాంగిల్‌ని ఎలాగూ ఫీల్‌ అవుతారనుకోండి.

 

ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌ కూడా సో హాట్‌ కదా! అదేనండీ. అందాల ఛార్మి.. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌తో కలిసి ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఛార్మి హాట్‌నెస్‌ లెవల్స్‌ తెలియని వారుంటారా.? చెప్పండి. నో వే. 'ఇస్మార్ట్‌ శంకర్‌' ప్రమోషన్స్‌లో ఛార్మి కూడా హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా హాట్‌ అప్పీల్‌ ఇస్తోంది మరి. ఇదంతా బానే ఉంది. కానీ, ఈ హాట్‌ హాట్‌ ప్రమోషన్స్‌ సినిమాకి హాటెస్ట్‌ కిక్‌ ఇవ్వడంలో ఎంత మేర యూజ్‌ అవుతాయో తెలియాలంటే జూలై 18 వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS