ఆ విషయంలో నిధి అవుట్‌ నభా ఇన్‌ ఎందుకంటే?

మరిన్ని వార్తలు

నిధి అగర్వాల్‌కి తొలి రెండు సినిమాలూ ఆశించిన విజయాల్ని అందించకపోయినా, ఇంతవరకూ ఆమెకు ఓ స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. కానీ, ఆ క్రేజ్‌ ఎందుకో పూరీ సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో పోయేలా ఉంది. ఈ సినిమా కోసం తొలుత వినిపించిన పేరు నిధి అగర్వాల్‌దే. తొలి ఇస్మార్ట్‌ గాళ్‌గా నిధి పేరే రిజిస్టర్‌ అయ్యింది. ఆ తర్వాతే నభా నటేష్‌ పేరు ఇన్‌స్టాల్‌ అయ్యింది. అయితే, విడుదలైన స్టిల్స్‌ పరంగా చూస్తే, సినిమాలో ఇద్దరి ఇంపార్టెన్స్‌, అప్పియరెన్స్‌ ఈక్వెల్‌ ఈక్వెల్‌ అంటూ ప్రమోట్‌ అయ్యింది. కానీ, ట్రైలర్‌ వచ్చాక సీన్‌ మారిపోయింది. ట్రైలర్‌లో ఎక్కువగా నభా నటేష్‌కే ప్రాధాన్యత దక్కింది. మరీ ముఖ్యంగా ట్రైలర్‌లో ఆమె చెప్పిన డైలాగ్‌.. 'డాష్‌ పోయిస్తా' అనే డైలాగ్‌కి ఆమె పేరు మార్మోగిపోతోంది.

 

ఈ దెబ్బతో నిధి అగర్వాల్‌ కాస్త తగ్గి, నభా నటేష్‌ పేరు ముందుకొచ్చేసిందనిపిస్తోంది. పూరీ మార్క్‌ ఇస్టైల్‌లో నభా, సినిమాలో ఇరగదీసేసి ఉంటుందనిపిస్తోంది. అందాల ఆరబోత పరంగా నిధి నుండే ఆడియన్స్‌ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్‌ చేశారు. కానీ, నభా నటేష్‌ కూడా అస్సలు తగ్గలేదు. అంతకు మించి డైలాగ్స్‌, బాడీ లాంగ్వేజ్‌ పరంగా చూస్తే నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ని డామినేట్‌ చేసేలానే ఉంది. సో నభాకి నిధితో పోల్చితే సినిమాలో సీన్‌ చాలా ఎక్కువ అనే ప్రచారం జరుగుతోంది.

 

ఒకవేళ ఇదే నిజమైతే, అనూహ్యంగా హీరోయిన్స్‌ విషయంలో స్టార్టింగ్‌లో ఉన్న సీన్‌కీ, ఇప్పటి సీన్‌కీ డిఫరెన్స్‌ బాగా వచ్చేసింది. ఒకవేళ అన్నీ బావుండి, సినిమా హిట్‌ అయితే, నభా నటేష్‌ దశ తిరిగిపోయినట్లే. ఏది ఏమైనా ఇస్మార్ట్‌ గాళ్స్‌లో ఎవరి సీను ఎంతో తెలియాలంటే, కొద్ది రోజులే ఆగాలిక. జూలై 18న 'ఇస్మార్ట్‌ శంకర్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS