'ఇస్మార్ట్‌ హిట్‌' పక్కా అంటోన్న ఇస్మార్ట్‌ టీమ్‌!

మరిన్ని వార్తలు

ఈ మధ్య పూరీ ఏ సినిమా చేసినా విమర్శలు వెంటొస్తున్నాయి తప్ప, హిట్స్‌ రావడం లేదు. దాంతో స్టార్‌ హీరోలు ఆయన్ని నమ్మేందుకు భయపడుతున్నారు. కానీ, హీరో రామ్‌, పూరీతో చేయి కలిపి అద్భుతం సృష్టిస్తానంటున్నాడు. పూరీ అంటేనే మాస్‌. కానీ, ఆ మాస్‌కే మాస్‌ ఊరమాస్‌ అనిపించేలా 'ఇస్మార్ట్‌ శంకర్‌' తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విషయంలో పూరీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. పక్కా హిట్‌ కొడతానంటున్నాడు. ఈ సినిమాకి బజ్‌ కూడా పాజిటివ్‌గా వస్తుండడంతో 'ఇస్మార్ట్‌' టీమ్‌ ఫుల్‌ ఖుషీ అవుతోంది.

 

విడుదల దగ్గర పడుతున్న కొద్దీ, ప్రమోషన్స్‌ కూడా బాగా పెంచేశారు. ఇప్పటికే ఇస్మార్ట్‌ కిక్‌ బాగా తలకెక్కేసింది ఆడియన్స్‌కి. మ్యాగ్జిమమ్‌ రేంజ్‌లో పూరీ తన ఇస్మార్ట్‌ పైత్యాన్ని ఈ సినిమా కోసం వాడేసినట్లు కనిపిస్తోంది. ఈ గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో రామ్‌ మసాలా యాక్షన్‌తో పాటు, హీరోయిన్స్‌ స్పైసీ గ్లామర్‌ టచ్‌ కూడా బాగా ఎక్కువ ఉండడంతో, ఇప్పటికే మాస్‌ సెంటర్స్‌లో ఈ సినిమా కోసం ఆశక్తి నెలకొంది. ఆ మాటకొస్తే, ఈ సారి పూరీ క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా, బీసీ ధియేటర్స్‌తో పాటు, మల్టీప్లెక్సులూ ఆడ్వాన్స్‌ హౌస్‌ఫుల్‌ చేసేశాడనే రిపోర్ట్‌ వస్తోంది.

 

ఈ సినిమా ఓ మోస్తరు హిట్‌ అయినా, పూరీ బౌన్స్‌ బ్యాక్‌ అయిపోయినట్లే. అలాంటిది పక్కా హిట్‌ అనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఓపెనింగ్స్‌ ఘనంగా ఉండడమైతే పక్కా. ఇక హీరోయిన్స్‌ శృతి మించిన శృంగార భంగిమలకు రిపీటెడ్‌ ఆడియన్స్‌నీ లాగే అవకాశం లేకపోలేదనిపిస్తోంది. అలా చూసుకున్నా, ఇస్మార్ట్‌ వసూళ్లు దక్కించుకోవడం ఖాయమనేది ట్రేడ్‌ టాక్‌. చూడాలి మరి అంచనాల్ని అందుకోవడంలో 'ఇస్మార్ట్‌ శంకర్‌' పనితనం ఎలా ఉండబోతోందో కొన్ని గంటల్లోనే తెలిసిపోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS