ఈ నెల 19న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రెండూ డబ్బింగ్ సినిమాలే. అయితే, రెండూ డిఫరెంట్ జోనర్ మూవీసే. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నేటి జనరేషన్ అమ్మాయిల జీవిత చిత్రాన్ని తలపించేలా వస్తున్న 'ఆమె' ప్రచార చిత్రాలతో ఇప్పటికే ఆకట్టుకుంది. అమలాపాల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో అమలాపాల్ న్యూడ్ షో కీలకం. ఈ సీన్ కోసమైనా సినిమాకి ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతారు. అయినా, తెలుగులో సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే నిర్వహిస్తున్నారు.
ఇక రెండో సినిమా విలక్షణ నటుడు విక్రమ్ నటిస్తున్న 'కేకే'. ఇదో పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ. కమల్‌హాసన్ నిర్మాణంలో రూపొందిన చిత్రమిది. టెక్నికల్‌గా నిర్మాణ విలువలు చాలా బాగా చూపించారని టీజర్, ట్రైలర్స్ ద్వారా అర్ధమవుతోంది. కమల్ కూతురు అక్షరాహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విక్రమ్ గెటప్ కొత్తగా ఉంది. యాక్షన్ మోడ్ ఎప్పటిలాగే ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే, ఈ మధ్య విక్రమ్ సినిమాలకు తెలుగులో మార్కెట్ బాగా పడిపోయింది.
కానీ, ఈ సినిమాతో ఆ మార్కెట్ పుంజుకునే అవకాశముందంటున్నారు. కానీ, ప్రమోషన్స్‌లో విక్రమ్ వీక్‌గా కనిపిస్తున్నాడు అమలాపాల్‌తో పోల్చితే. మిగిలిన ఈ గ్యాప్‌లో అయినా, విక్రమ్ ప్రమోషన్స్‌పై కాస్త దృష్టి పెడితే, సినిమాకి అది ప్లస్ అవుతుందనడం అతిశయోక్తి కాదు. ఆయనకున్న అతి కొద్దిమంది డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. చూడాలి మరి, 'ఆమె', 'కేకే' యాక్షన్ ఫైట్‌లో విన్నర్ ఎవరో.!