అందం, అభినయం ఉంటే మాత్రమే చాలదు. హీరోయిన్స్ అన్నాక వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కెరీర్‌లో ముందుకు పోవాలంటే, సర్దుకుపోవడం ఒకెత్తు. వివాదాల్లో తల దూర్చకపోవడం ఇంకో ఎత్తు. కానీ 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి విషయంలో మాత్రం ఆ వివాదాలే కొంప ముంచేస్తున్నాయనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమా నుండీ వివాదాలతో సావాసం చేస్తూనే ఉంది. ఫిదా టైంలో షూటింగ్‌కి లేటుగా వచ్చేదనీ, 'ఎంసీఏ' టైంలో నానితో గొడవలనీ.. ఇప్పుడు తాజా సినిమా 'కణం' విషయంలో నాగశౌర్యతో డిస్ట్రబెన్సెస్ అంటూ ఏదో రకంగా వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతున్నాయి.
మంచి నటిగా పేరు తెచ్చుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఈ వివాదాలపై స్పందించడం కూడా సాయిపల్లవికి అవసరం. కుప్పలు తెప్పలుగా సాయిపల్లవిపై వస్తున్న ఈ గాసిప్స్‌ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. వదిలేస్తే ఈ గాసిప్స్ ఇంతటితో ఆగవు. వీర విహారం చేస్తాయి. టాలెంట్ లేకుండా హీరోయిన్స్‌గా పరిచయమైనవాళ్లకి ఎలాగూ తప్పదు. ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగైపోతారు. కానీ సాయిపల్లవి విషయంలో అలా కాదు. టాలెంట్ ఉన్న అమ్మాయి. ఎలాంటి పాత్రనైనా ఈజీగా నటించి రక్తి కట్టించగల నటి. అలాంటిది ఈ గాసిప్స్‌ని ప్రోత్సహిస్తూ, అవతలి వారికి ఎందుకిలా ఛాన్సిస్తుందో తెలీయడం లేదు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రం 'కణం'. విజయ్ దర్శకత్కవంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సాయిపల్లవికి చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమాలో సాయి పల్లవి పోషిస్తున్న పాత్ర ఆషామాషీ పాత్ర కాదు. ఓ తల్లి పాత్ర. తల్లీ కూతుళ్ల మధ్య సంబంధాన్ని, వారి మధ్య భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించే సినిమా 'కణం'. మార్చి 5న 'కణం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుకలోనే రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేయనున్నారు.