'జాను' తర్వాత సమంత కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, సమంత కోసం ఇంకా కొన్ని ప్రాజెక్టులు రూపు దిద్దుకుంటున్నాయట. 'రంగస్థలం' సినిమా తర్వాత సమంతకు అన్నీ హీరోయిన్ సెంట్రిక్ మూవీసే ఎక్కువగా వస్తున్నాయి. తాజా చిత్రం 'జాను' కూడా సమంత యాంగిల్ నుండి రూపు దిద్దుకున్న మూవీనే. సో ఆల్ మోస్ట్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనే అనుకోవాలి. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన క్లాసిక్ మూవీ '96'కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇదంతా బాగానే ఉంది. కానీ, 'జాను' తర్వాత సమంత నెక్స్‌ట్ ఫిలిం ఏంటీ.? అనే టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌పై సమంత బాగా దృష్టి పెట్టింది. వెండితెరపై పొందాల్సిన గుర్తింపు పొందేసింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఇక డిజిటల్ ఛానెల్ పైనా తనదైన ముద్ర వేసే దిశగా సమంత అడుగులు వేస్తోందనీ తెలుస్తోంది. అంటే, సినిమాలకు బ్రేకిచ్చిన తర్వాత సమంత వెబ్ సిరీస్‌లో జోరుగా నటిస్తుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై డిస్కషన్స్ జరుగుతున్నప్పటికీ, ఇప్పటికి ఈ విషయంపై దాదాపు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సిరీస్ సెకండ్ సీజన్‌లో సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రియమణికి ఈ వెబ్‌సిరీస్‌తో చాలా మంచి గుర్తింపు దక్కింది.