'అశ్వథ్ధామ'కు బేబీ ప్రశంసలు.!

మరిన్ని వార్తలు

'ఓ బేబీ' సినిమాలో కలిసి నటించారు నాగశౌర్య, సమంత. వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు చాలా క్యాజువల్‌గా మనసుకు హత్తుకునేలా చూపించారు డైరెక్టర్‌ నందినీ రెడ్డి ఈ సినిమాలో. అలా రీల్‌ పరిచయం కాస్తా రియల్‌గానూ పెరిగి పెద్దదైంది. మంచి స్నేహం కుదిరింది వీరిద్దరి మధ్యా. లేటెస్ట్‌గా నాగశౌర్య 'అశ్వథ్ధామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సామాజిక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి ఓ మోస్తరు విజయం దక్కింది.

 

అయితే, లవర్‌ బోయ్‌లా కనిపించే నాగశౌర్య ఈ సినిమాతో ఓ సాహసానికి తెర లేపారనే చెప్పాలి. తనలో లవర్‌ బోయే కాదు, ఓ యాక్షన్‌ హీరో కూడా ఉన్నాడనిపించుకునే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో సక్సెస్‌ అయినట్లే అని చిన్నగా టాక్‌ వినిపిస్తోందనుకోండి. అదే సమంత కూడా ప్రస్థావిస్తూ, టాలీవుడ్‌కి ఓ మంచి యాక్షన్‌ హీరో దొరికాడు.. అంటూ 'అశ్వథ్ధామ'గా నాగశౌర్యకి బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చేసింది. తాజాగా హైద్రాబాద్‌లో జరిగిన 'పాఠశాలల్లో రోడ్‌ సేఫ్టీ క్లబ్‌' అనే ఓ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే 'అశ్వథ్థామ' సినిమా గురించి సమంత ప్రస్థావించింది. ప్రస్తుతం సమంత 'జాను' చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' అనే ఓ వెబ్‌ సిరీస్‌లోనూ సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS