'ఆర్‌ఎక్స్‌ 100'కు ఆర్జీవీ ప్రశంస

By iQlikMovies - July 13, 2018 - 18:32 PM IST

మరిన్ని వార్తలు

సంచలన ట్వీట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచే డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ఏం ట్వీటేసినా ఎలా ట్వీట్‌ చేసినా, డిఫరెంట్‌గానే ఉంటుంది. ఈ మధ్య ఆర్జీవీ ట్వీట్స్‌ అంతగా వినిపించడంలేదెక్కడా. 

తాజాగా ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అయితే ఇదేం కాంట్రవర్సీ కాదులెండి. కాంప్లిమెంట్‌. తన వద్ద శిష్యుడిగా పని చేసిన అజయ్‌ భూపతిని ప్రశంసిస్తూ ఆర్జీవీ ఓ కాంప్లిమెంట్‌ ట్వీట్‌ చేశారు. అజయ్‌ భూపతి ఇప్పుడీ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. అందుకు కారణం ఆయన తెరకెక్కించిన 'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రమే. లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అందులో భాగంగానే రామ్‌గోపాల్‌ వర్మ కూడా తన శిష్యుడు తెరకెక్కించిన సినిమాకి ఇంత మంచి టాక్‌ వచ్చినందుకు ఆయన్ని అభినందిస్తూ, తన తర్వాతి సినిమాకు తనను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పెట్టుకోమని ట్వీట్‌ చేశాడు. 

అంటే సినిమా అంత బాగుందనీ, పరోక్షంగా తన శిష్యున్ని అభినందించాడు రామ్‌గోపాల్‌ వర్మ. వర్మ ఏం చేసినా స్పెషలే కదా. అందుకే అలా స్పందించారు మరి. అజయ్‌ భూపతితో వర్మ ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు వర్మ. నిజంగా అజయ్‌కి ఇది బెస్ట్‌ కాంప్లిమెంటేగా. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా 'ఆర్‌ ఎక్స్‌ 100' తెరకెక్కింది. 

బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోందీ సినిమా.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS