'రంగ‌స్థ‌లం'ఫేమ్ మ‌హేష్ హీరోగా 'నేను నా నాగార్జున'

By Ramesh - February 26, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

'రంగ‌స్థ‌లం' ఫేమ్ మ‌హేష్, సోమివ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా 'నేను నా నాగార్జున'. ఆర్‌.బి.గోపాల్ దర్శ‌క‌త్వంలో గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, క‌ళాబందు డా. టి.సుబ్బ‌రామిరెడ్డి ఆవిష్క‌రించారు. 

 

ఈ సంద‌ర్భంగా..డా. టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ - "సినిమా ఆద్యంతం కామెడీగా ఉంటుంది. నిర్మాత నాగేశ్వ‌ర‌రావుగారు ఈ చిత్రంలో నాగార్జున‌గారి అభిమానిగా,కీల‌క పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. నాగార్జున‌గారిపై అభిమానాన్ని, గౌర‌వాన్ని తెలియ‌జేసేలా ఈసినిమాను నిర్మించారు. డైరెక్ట‌ర్ ఆర్‌.బి.గోపాల్ సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. మహేష్ హీరోగా న‌టిస్తున్న చిత్ర‌మిది. అలాగే సోమివ‌ర్మ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. వీరిద్ద‌రు స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు.సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను" అన్నారు. 

 

నిర్మాత గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ - "సినిమాను నిర్మిస్తూనే .. చాలా కీల‌క‌మైన పాత్ర‌లో నటించాను. డైరెక్ట‌ర్ ఆర్‌.బి.గోపాల్‌గారు అనుకున్న స‌మ‌యంలో సినిమాను ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేశారు. మ‌హేష్‌, సోమివ‌ర్మ చ‌క్క‌గా న‌టించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మంచి ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. విశాఖ ప‌ట్న వాసినైన నేను విశాఖ ప‌ట్నంలోనే షూటింగ్ చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది" అన్నారు.

 

- ప్రెస్ రిలీజ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS