కన్నడలో 'కిర్రాక్ పార్టీ' సినిమాతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. తెలుగులో 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో అమాంతం రెండో సినిమాకే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ కన్నడకుట్టీకి కోలీవుడ్ నుండి కూడా పిలుపొచ్చింది. కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో రష్మికాని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు.
ఆ తర్వాత స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య సినిమాలో కూడా రష్మికానే హీరోయిన్ అని తెలుస్తోంది. అంటే ఎట్ ఏ టైమ్ అన్నదమ్ములిద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుందన్న మాట రష్మికా మండన్నా. కార్తితో చేయబోయే చిత్రమే రష్మికాకి కోలీవుడ్‌లో తొలి చిత్రం. ఎంట్రీలోనే రెండు బిగ్ ప్రాజెక్టుల్లో ఛాన్స్ దక్కించుకుందంటే అమ్మడి క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇదే క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యూటీ రెమ్మునరేషన్ పెంచేసిందనీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమో రష్మికా క్రేజ్‌కి కోటి ఇచ్చి కూడా తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకునేందుకు కోలీవుడ్ దర్శక, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. అంటే ఓ పక్క తెలుగులోనూ, మరోపక్క తమిళంలోనూ కూడా రష్మికా దున్నేస్కోనుందన్న మాట.