అనసూయపై ‘అదుపు’ తప్పుతున్న కామెడీ!

మరిన్ని వార్తలు

జబర్‌దస్త్‌.. బుల్లితెరపై ఈ కామెడీ ప్రోగ్రామ్ ఓ సంచలనం. ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రోగ్రామ్ కి ఎదురే లేకుండా పోయింది. ఎన్నో వివాదాలు.. చివరికి ఇందులో నటించిన కమెడియన్లపై దాడులు చూశాం. అవేవీ ఈ ప్రోగ్రావ్‌ుని ఆపలేకపోయాయి. ఆఖరికి నాగబాబు, ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పుకున్నా.. అదే ఊపుతో కొనసాగుతోంది. అయితే, క్రమక్రమంగా ‘కంటెంట్‌’లో పస తగ్గిపోతోందన్న విమర్శల్ని మాత్రం ఎదుర్కొంటోంది.

 

మరీ ముఖ్యంగా రష్మి, అనసూయ మీద కామెడీ పంచ్‌లు మరీ బోర్‌ కొట్టేస్తున్నాయి. ‘ఎక్స్‌ట్రా’ జబర్‌దస్త్‌ కోసం రష్మితో ‘ఎక్స్‌ట్రా’ కామెడీ చేసేస్తున్నాడు సుడిగాలి సుధీర్‌. జబర్‌దస్త్‌లో ‘ఆది’, అనసూయపై చేస్తోన్న ‘అతి’ కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. మొత్తంగా స్కిట్‌ అంతా అనసూయ మీదనే అల్లేస్తున్నాడు ఆది ఈ మధ్య. ఓ సారికి బాగానే వుంటుంది.. ప్రతిసారీ అదే కామెడీ అంటే బోర్‌ కొట్టేయదూ.!

 

మరోపక్క, అనసూయ ఎందుకు ఇలాంటివాటిని ఎంకరేజ్‌ చేస్తోంది.? రష్మిక లవ్‌ పేరుతో సుధీర్‌తో కామెడీ చేయడమేంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అలా చర్చ జరగడానికే స్కిట్లు.. అంటున్నాడు ఆది.. అది కూడా జబర్‌దస్త్‌ సాక్షిగా. కామెడీ పండితే, అది పాపులర్‌ అవుతుంది. పాపులర్‌ అవడం కోసం అతుకుల బొంత కామెడీ అంటే అది సబబుగా వుండదు కదా? గత కొద్ది రోజులుగా జబర్‌దస్త్‌ కామెడీ షోలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో అనసూయ, రష్మిలపై కామెడీ తగ్గిస్తే బెటరేమో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS