ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. టీజర్‌ రివ్యూ

మరిన్ని వార్తలు

కొన్ని సినిమాలుంటాయ్‌.. అవి నిర్మితమవుతున్నప్పుడు పెద్దగా ఎవరూ వాటిని పట్టించుకోరు. కానీ, విడుదలయ్యాక అవి సంచలనాలుగా మారుతుంటాయి. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఆ కోవలోకే వస్తుంది. ఆ టీం ఇప్పుడు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అంటోంది. సత్య దేవ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ కాసేపటి క్రితం విడుదలయ్యింది. ఓ సాధారణ ఫొటోగ్రాఫర్‌గా సత్య దేవ్‌ ఈ సినిమాలో నటిస్తుండడం గమనార్హం. అతని రూపం, అతని బాడీ లాంగ్వేజ్‌ అన్నీ ఈ సినిమాలో చాలా కొత్తగా వున్నాయి. మంచి నటుడు కావడంతో, పాత్రలో ఒదిగిపోయాడు. చాలా నీట్‌గా, క్యూట్‌గా టీజర్‌లో సన్నివేశాలు కన్పిస్తున్నాయి.

ఉగ్ర రూపం మాత్రం దాచిపెట్టినట్లున్నారు. ఇంత ప్రశాంతంగా, పిరికోడిలా కన్పించే మహేష్‌ అలియాస్‌ ఉమామహేశ్వరరావు, ఉగ్ర రూపం ఎందుకు దాల్చుతాడు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఆ లైటింగ్‌, ఆ ఫ్రేమింగ్‌.. అన్నీ సూపర్బ్‌. మరోపక్క, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకుంది. నిర్మాణపు విలువలు బాగానే కన్పిస్తున్నాయి టీజర్‌లో. ఏప్రిల్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్‌ మహా ఈ చిత్రానికి దర్శకుడు. ఆర్కా మీడియా, మహా యాన మీడియా వర్క్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీజర్‌ చూశాక సినిమాపై అంచనాలు పెరగడం ఖాయంగానే కన్పిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS