బుల్లి తెరపై సంచలనం సృష్టించింది జబర్థస్త్. టీవీ రేటింగుల్లో ... జబర్థస్త్ దే పై చేయి. ఆ స్టేజీపై కనిపించినవాళ్లలో చాలామంది స్టార్లుగా ఎదిగారు. సినిమాల్లో అవకాశాలు సంపాదించుకొన్నారు. బుల్లి తెర ద్వారా ఇంత పాపులారిటీ సంపాదించుకోవచ్చని... నిరూపించారు. అయితే జబర్థస్త్ నటీనటుల్లో చీలిక మొదలైంది. ఈ షో నుంచి ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చేశారు. ఇంకొంతమంది వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జబర్థస్త్ పాపులర్ అయ్యాక.. ఎక్స్ ట్రా జబర్‌దస్త్ అంటూ.. దానికి కొనసాగింపుగా ఇంకో షో చేశారు. అయితే త్వరగా ఎక్స్ ట్రా జబర్‌దస్త్ ఉండదని, కేవలం జబర్‌దస్త్ మాత్రమే ఉంటుందని టాక్.
అంతేకాదు.. ఈ షో వెనుక చాలా లుకలుకలు నడుస్తున్నాయి. తాజాగా ఈ షో నుంచి బయటకు వచ్చేసిన ఆర్పీ.. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ రెడ్డి, ఆయన వ్యవహార శైలిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జబర్థస్త్ లోని నటీనటుల్ని బానిసలుగా చూస్తారని, కనీసం ఫుడ్ కూడా పెట్టరని, నాశిరకమైన ఆహారాన్ని అందిస్తారని, ఎవ్వరికీ విలువ ఇవ్వరని, వాళ్లకు తొత్తులుగా ఉన్నవాళ్లకే అవకాశాలు అందుతాయని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.
దానిపై రామ్ ప్రసాద్, హైపర్ ఆది.. కౌంటర్ ఇచ్చారు. ఆర్పీ.. మాటల్ని ఖండించారు. మరోవైపు షేకింగ్ షేషు.. కూడా ఆర్పీని నానా మాటలు అన్నారు. అసలు ఆర్పీ అబద్ధాల రాయుడు అంటూ. విమర్శలు చేశారు. దాంతో.. ఆర్పీ కూడా రెచ్చిపోయాడు. `నీ పిండం నేనే పెడతా. నీ దహన సంస్కారాలకు డబ్బులు ఇస్తా` అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ఆర్పీ మాటలతో జబర్థస్త్ నటుల మధ్య పొరపొచ్చాలు స్పష్టంగా బయటకు వచ్చాయి. ఆర్పీకి సపోర్ట్ చేసేవాళ్లు ఎవరూ లేకపోవడం విచిత్రం. అయితే ఈ షో నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసిన కొంతమంది ఆర్పీ తరపున మాట్లాడాలని నిర్ణయించుకొన్నార్ట. అదే జరిగితే ఇంకాస్త రచ్చ జరగడం ఖాయం.