బాలీవుడ్‌ 'పార్టీ'లో ఆ బ్యూటీ

By iQlikMovies - September 04, 2018 - 15:46 PM IST

మరిన్ని వార్తలు

కన్నడలో ఘనవిజయం సాధించిన 'కిరిక్‌ పార్టీ' సినిమా తెలుగులోకి 'కిర్రాక్‌ పార్టీ' పేరుతో రూపొంది ఇక్కడా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే. కన్నడ 'కిరిక్‌ పార్టీ' సినిమాతోనే రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ సంపాదించుకుంది రష్మిక మండన్న. ఆ సినిమా ఆమెకు తెలుగులోనూ అవకాశాలు తెచ్చిపెట్టేలా చేసింది. 

తెలుగులో ఇప్పుడు స్టార్‌ హీరోయిన్లలో రష్మిక పేరు కూడా విన్పిస్తోందంటే అదంతా ఆమెకు 'కిరిక్‌ పార్టీ' ద్వారా వచ్చిన ఫాలోయింగే. తెలుగులో రూపొందిన 'కిర్రాక్‌ పార్టీ' సినిమాలో మాత్రం ఆమె హీరోయిన్‌గా నటించలేదు. ఈ సినిమాలో యంగ్‌ హీరో నిఖిల్‌ హీరోగా నటించాడు. తాజాగా ఈ 'కిరిక్‌ పార్టీ' బాలీవుడ్‌కి వెళుతోంది. శ్రీలంకన్‌ బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ బాలీవుడ్‌ 'కిరిక్‌ పార్టీ'లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పటికే ఆమె ఈ సినిమాలో నటించడం కోసం సర్వసన్నద్ధంగా వుందట. 

తెలుగులో వచ్చిన 'కిరాక్‌ పార్టీ' సినిమానీ, కన్నడలో వచ్చిన 'కిరిక్‌ పార్టీ' సినిమానీ పలుమార్లు తిలకించిందట జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. ఏ సినిమా ఒప్పుకున్నా, ఆ సినిమాలో పెర్‌ఫెక్షన్‌తో కూడిన నటన ప్రదర్శించాలనుకుంటుంది ఈ శ్రీలంకన్‌ బ్యూటీ. ఆమె చేరికతో 'కిరిక్‌ పార్టీ'కి బాలీవుడ్‌లో బీభత్సమైన హైప్‌ క్రియేట్‌ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. 

కాలేజ్‌లో స్టూడెంట్‌ లైఫ్‌కి సంబంధించి 'కిరిక్‌ పార్టీ'ని అత్యద్భుతంగా రూపొందించారు. కన్నడలో, తెలుగులో విజయవంతమైన ఈ సినిమాకి హిందీలోనూ విజయవంతమయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS