బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా నాని చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎట్టకేలకు తనపై వస్తున్న విమర్శలకు నాని సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చాడు.
'బిగ్‌బాస్' రియాల్టీ షో హోస్ట్‌గా నాకు అందరూ సమానమే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది డిసైడ్ చేసేది మేం కాదు. ఈ విషయంలో అందరూ నన్ను అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను. నాపై వస్తున్న విమర్శలు నన్ను బాధించాయి. అయితే ఎప్పటికీ నేను మీ నానినే. ఆ విషయం నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఎలిమినేషన్ ప్రక్రియ గురించి మీకందరకూ తెలుసు. అది కేవలం ఓట్ల ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ గురించి నాపై ఆరోపణలు సబబు కాదు. హోస్ట్‌గా హౌస్‌లో ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశం దక్కాలని ఆశిస్తుంటాను. అంతే తప్ప ఒకరికి తక్కువగా, ఇంకొకరికి ఎక్కువగా సమయం కేటాయించాలని ఎప్పుడూ అనుకోను. బిగ్‌బాస్‌కి సంబంధించి ఇదే నా చివరి స్పందన అని పేర్కొన్నాడు.
ఎంతలా నాని వివరణ ఇచ్చుకున్నా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగే పరిస్థితి లేదు. ఒకటి రెండు ఎపిసోడ్స్ తప్ప ప్రతీ నామినేషన్‌లోనూ కౌషల్ పేరుంటోంది. ఇది కౌషల్ ఆర్మీకి నచ్చడం లేదు. ఈ వారం కూడా కౌషల్ నామినేట్ అయ్యాడు.
నామినేషన్ ప్రక్రియ హౌస్ మేట్స్ చేతుల్లోనే వున్నా.. ఆ హౌస్ మేట్స్‌ని 'గూడు పుఠానీ' విషయంలో హెచ్చరించాల్సిన, వారిని దార్లో పెట్టాల్సిన బాధ్యత హోస్ట్ మీదనే వుంటుంది. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో నాని విఫలమవుతున్నాడనే విమర్శ ఉంది.