శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్‌లో బోల్డంత స్టార్‌డమ్ సంపాదించుకుంది. వరుస సినిమాలతో బిజీగా వుంది బాలీవుడ్‌లో ఈ బ్యూటీ. ఈ మధ్యనే తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించేదెప్పుడు.? అని ప్రశ్నిస్తే, ‘త్వరలోనే’ అని గతంలో సమాధానం చెప్పింది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇప్పట్లో తాను మళ్ళీ తెలుగు సినిమా చేసే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది. దానిక్కారణం బాలీవుడ్‌లో తాను బిజీగా వుండడమేనట. ‘అక్కడా ఇక్కడా సినిమాలు చేయడమంటే దానికి చాలా కష్టపడాలి.
ఈ క్రమంలో అక్కడి నిర్మాతకిగానీ, ఇక్కడి నిర్మాతకిగానీ ఇబ్బంది కలగకూడదన్నదే నా ఉద్దేశ్యం. తగినంత సమయం దొరికితే తెలుగులోనే కాదు, సౌత్‌లోనూ సినిమాలు చేయాలని వుంది..’ అంటూ జాక్వెలైన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రభాస్ మంచి కో-స్టార్ అనీ, కేవలం స్పెషల్ సాంగ్ కోసమే ఆయన పక్కన చేసినా, ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా ప్రత్యేకమైదని జాక్వెలైన్ పేర్కొంది. ప్రభాస్ సరసన మళ్ళీ సినిమా చేసే అవకాశం వస్తే.? అన్న ప్రశ్నకు, ‘ఛాన్స్ వస్తే వదులుకోను’ అని బదులిచ్చింది జాక్వెలైన్. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ సరసన జాక్వెలైన్ పేరు పరిశీలించబడ్తోందంటూ ఊహాగానాలు విన్పిస్తున్న విషయం విదితమే. జాక్వెలైన్ మాత్రం, ఇప్పట్లో తెలుగులో సినిమాలు చేయడంలేదని స్పష్టం చేసేసింది.