బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ 'సాహో' సినిమాతో తెలుగు తెరపై మెరిసిన విషయం విదితమే. చేసింది ఓ హాట్ అండ్ స్పైసీ స్పెషల్ సాంగే అయినా, ఆ సాంగ్‌తో ఓ ఊపు ఊపేసింది. తెలుగులో 'సాహో' అంచనాల్ని అందుకోలేకపోయింది. అయితే, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం, చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్ళను రాబట్టింది.
'సాహో' సంగతి పక్కన పెడితే, ఆ సినిమా తర్వాత కూడా జాక్వెలైన్‌కి మరో స్పెషల్ ఐటమ్ నెంబర్ ఆఫర్ చేసిందట ఓ ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ. తొలుత 'సరే' అని చెప్పిన జాక్వెలైన్, ఆ తర్వాత సదరు నిర్మాతకి మొహం చాటేసిందనే ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేసినప్పటికీ, చివరి నిమిషంలో రెమ్యునరేషన్‌ని మరింత పెంచేసిన జాక్వెలైన్, టాలీవుడ్ ఆఫర్‌ని వదులుకుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఏ సినిమా.? ఎవరు హీరో.? అన్న విషయాలపై పూర్తి స్పష్టత రావాల్సి వుంది.
'టాలీవుడ్‌లో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని వుంది..' అంటూ పలు ఇంటర్వ్యూల్లో ముద్దు ముద్దు మాటలు చెప్పిన శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్, ఇప్పుడిలా రివర్స్ గేర్ వేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. బాలీవుడ్ భామలకి ఆమాత్రం టెక్కు మామూలే. అందునా అక్కడున్నది జాక్వెలైన్.. దేన్నయినా డబ్బుతోనే కొలుస్తుందామె.