ఆ సీక్వెల్ బాధ్య‌త అల్లుడి చేతుల్లో పెట్టిన అశ్వ‌నీద‌త్

By Gowthami - May 07, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

వైజ‌యంతీ మూవీస్ సంస్థ బ్యాన‌ర్‌లో మ‌ర్చిపోలేని సినిమా... జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక సుంద‌రి. చిరంజీవి - శ్రీ‌దేవిల జంట‌, ఇళ‌య‌రాజా సంగీతం, ద‌ర్శ‌కేంద్రుడి మాయాజాలం ఆ సినిమాని క్లాసిక్స్‌లో నిలిపాయి. అబ్బ‌నీ తీయ‌ని దెబ్బ - లాంటి సూప‌ర్ హిట్ పాట‌ల కోస‌మైనా, ఈ సినిమాని ఇప్ప‌టికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు అభిమానులు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంద‌ని నిర్మాత అశ్వ‌నీద‌త్ ప్ర‌క‌టించారు. ఆ సీక్వెల్ తీశాకే, చిత్ర‌సీమ నుంచి నిర్మాత‌గా రిటైర్ అవుతాన‌ని చెప్పుకొచ్చారు అశ్వ‌నీద‌త్‌.

 

నిజానికి జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక సుందరి సీక్వెల్ గురించి ఎప్ప‌టి నుంచో చ‌ర్చ జ‌రుగుతోంది. రామ్ చ‌ర‌ణ్ - జాన్వీ క‌పూర్ ఈ సినిమాలో న‌టిస్తార‌ని చెప్పుకున్నారు. అయితే అది కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే ఇప్పుడు అశ్వ‌నీద‌త్ ప్ర‌క‌ట‌న‌తో మ‌ళ్లీ ఈ సీక్వెల్‌పై ఆశ‌లు చిగురించాయి. ఈ చిత్రానికి అశ్వ‌నీద‌త్ అల్లుడు నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. 2022 త‌ర‌వాతే ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయి. ‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS