తెలుగు సినీ పరిశ్రమ తల్లడిల్లిపోతోంది అందమైన నగరం విశాఖలోని ఓ పరిశ్రమ నుంచి విష వాయువులు లీక్ అయిన ఘటన నేపథ్యంలో. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ సహా పలువురు సినీ ప్రముఖులు విశాఖలో చోటు చేసుకున్న ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్నాం.. ఈ పరిస్థితుల్లో విశాఖ నగరానికి ఈ విపత్తు రావడం బాధాకరం..’ అని తెలుగు సినీ పరిశ్రమ ముక్త కంఠంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. సినీ పరిశ్రమకు విశాఖ నగరంతో వున్న అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా షూటింగులకి అత్యంత అనుకూలమైన నగరం విశాఖపట్నం.
అదొక్కటే కాదు, ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నంని, విహార యాత్రల కోసం కూడా సినీ ప్రముఖులు ప్రత్యేకంగా ఎంచుకుంటుంటారు. మరోపక్క, విశాఖ నుంచి వచ్చిన చాలామంది సినీ పరిశ్రమలో తమదైన గుర్తింపు పొందారు. నాని, కళ్యాణ్‌రామ్, సురేందర్‌రెడ్డి, సునీల్, అల్లరి నరేష్, శ్రీకాంత్, దర్శకుడు మారుతి, రవితేజ, నాగ శౌర్య, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని.. ఇలా సినీ ప్రముఖులంతా విశాఖ ఘటనపై చలించిపోయారు. బాధితులకు సంఘీభావం తెలిపారు.
Heart breaking to see the visuals of #VizagGasLeak. My heartfelt condolences to the families of the people who are no more. I hope all necessary measures are taken to make sure the affected people recover at the earliest. My thoughts and prayers with the people of Vizag. 🙏🏼🙏🏼
— Ram Charan (@AlwaysRamCharan) May 7, 2020
Heartwrenching to hear the news of #VizagGasLeak, more so during these challenging times... Heartfelt condolences and strength to the bereaved families in this hour of need. Wishing a speedy recovery to those affected. My prayers for you... Stay safe VIZAG.
— Mahesh Babu (@urstrulyMahesh) May 7, 2020
విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.Request all concerned authorities to take utmost care while opening Industries post lockdown.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2020