లెజెండ్‌తో జగపతిబాబు కెరీర్ మరో టర్న్ తీసుకుంది. అంతకు ముందు హీరోగా పూర్తిగా డీలా పడిపోయిన జగపతిబాబు... ప్రతినాయకుడిగా ఎప్పుడైతే యూటర్న్ తీసుకొన్నాడో అప్పటి నుంచీ ప్రయాణం జోరందుకొంది. లెజెండ్ లో జితేంద్రగా జగపతి పండించిన విలనిజం అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా జగపతి బాబు గ్రాఫ్ మరో స్థాయికి లేచింది. ఇప్పుడు జగపతి బాబు అంటే క్రేజీ స్టార్. ఆయనకు వరుసగా క్రేజీ క్రేజీ పాత్రలు పడుతున్నాయి. విలనిజం పడించాలన్నా, అటు హుందాగా వుండే పాత్రలు చేయాలన్నా జగపతినే ఫస్ట్ ఛాయిస్.
తాజాగా ఆయనకు మరో క్రేజీ ఆఫర్ వెళ్ళింది. రామ్ చరణ్- సుకుమార్ కలయికలో ఓ సినిమా తెరక్కెక్కనుంది. సమంత, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం జగపతి బాబునే ఎంపిక చేసుకున్నాడట సుకుమార్. 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో జగపతి బాబుకి అదిరిపోయే రోల్ ను డిజైన్ చేశాడు సుకుమార్. కేవలం మాట, ఆహార్యం తోనే విలనిజం ఫీక్స్ లో చూపించాడు. తెలుగు సినిమాలో అలాంటి కొత్త విలనిజం చూపించడం ఆకట్టుకుంది. ఇప్పుడు మరో వైవిధ్యమైన విలన్ రోల్ ను డిజైన్ చేశాడట సుక్కు. దీనికి జగపతి బాబే కరెక్ట్ అని భావించడం, ఆయన్ని సంప్రదించడం, ఓకే చెప్పడం జరిగిపోయిందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.