జగపతిబాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'పటేల్ సర్'. టైటిల్‌లో చివర 'ఎస్‌ఐఆర్' అని ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి. టైటిల్‌లోని ఈ 'ఎస్‌ఐఆర్' అన్న అక్షరాలకు అర్థమేంటో సినిమా చూస్తేనే తెలుస్తుందట. వాటిని ఓ ప్రత్యేక రీజన్ కోసం అలా పెట్టారట. స్పెషల్ మీనింగ్ ఉందంటున్నాడు వాటికి జగపతిబాబు. 'పటేల్' అన్న పదంలోని పవర్ కోసం గెటప్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని అన్నారాయన. చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్ అట ఇది. ప్రోమోస్ చూస్తుంటేనే తెలుస్తోంది ఆ విషయం. అలాగే యాక్షన్ సీన్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఆ వయసేంటి? ఆ యాక్షన్ ఏంటి? అనుకుంటున్నారంతా. ప్రతీకారంతో కూడిన కథే అయినా, ఇందులో మమకారం చాలా ఎక్కువగానే ఉంటుందట. ఓ పాపని రక్షించే నేపధ్యంలో జగపతిబాబు కనబరిచిన నటన స్థాయి పీక్స్‌లో ఉంటుందంటున్నారు. ఇంతవరకు తానెప్పుడూ చేయని పాత్ర 'పటేల్' అని చెప్పారు జగపతిబాబు. గెటప్ కోసం తాము పడ్డ కష్టమంతా 'పటేల్' ఫస్ట్ లుక్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో మర్చిపోయామన్నారాయన. నేచురల్ గెటప్‌లో కనిపిస్తూనే , ఎక్కడా స్టైల్ మిస్ కాకుండా, హీరోయిజం మిస్ కాకుండా ఉంది ఆ గెటప్. అందుకే ఆ గెటప్‌కే బోలెడంత రెస్పాన్స్ వస్తోంది. గతంలో రొమాంటిక్ హీరోగా జగపతిబాబు పాపులర్ అన్న సంగతి తెలిసిందే. లేటు వయసులో కూడా అదే రొమాంటిక్ లుక్స్‌తో చంపేస్తున్నాడంతే మన జగ్గూభాయ్!