‘జై’ స్కోర్ 125 నాట్ అవుట్!

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో తన నట విశ్వరూపాన్ని చూపెట్టిన చిత్రం జై లవకుశ. ఈ చిత్రంలో తను పోషించిన ‘జై’ పాత్రకి మంచి పేరు రావడమే గాక ఈ చిత్రానికి వసూళ్ళు కూడా బాగానే వచ్చాయి.

ఈ తరుణంలో జైలవకుశ చిత్ర కలెక్షన్స్ సుమారు రూ 125 కోట్ల మార్కుని అందుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మంచి పండగ సీజన్ అయిన దసరాకి ఈ చిత్రం విడుదల అవ్వడంతో కలెక్షన్స్ పరంగా జై లవకుశ దూసుకుపోయిందనే చెప్పాలి.

ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా జనతా గ్యారేజ్ ఉండగా ఇప్పుడు ఆ రికార్డుని తిరగరాసేలా జై లవకుశ ఉన్నట్టు ఇటు ట్రేడ్ వర్గాలు అటు అభిమానులు సైతం లెక్కలు కడుతున్నారు.

మొత్తానికి ఈ దసరాకి ఎన్టీఆర్ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS