ప్రకాష్ రాజ్ - దేశం గర్వించదగ్గ నటుడే కాక సమాజం పట్ల బాధ్యత ఉన్నపౌరుడు కూడా. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాని రూపురేఖల్ని మార్చేసిన ఘనత కూడా ఈయనదే.
అయితే బెంగళూరులో ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకి కారణమైన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందింది అని అలాగే ఈ పరిస్ధితి తెలిసి కూడా నటిస్తున్న ప్రధాని మోడీ మహానటుడు అని విమర్శించాడు.
ఇదే సందర్భంలో మోడీ ఈ విషయంలో మౌనంగా ఉన్నందుకు తను నిరసనగా తన జాతీయ అవార్డుని వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పినట్టుగా వార్తలు రావడం పెద్ద సంచలనానికి దారితీశాయి. దీనితో ఈ అంశం పై వీడియో మెసేజ్ ద్వారా ప్రకాష్ రాజ్ స్పందించాడు.
గౌరీ లంకేష్ హత్య విషయంలో మోడీ మౌనం పై తనకి బాధ ఉన్నదని అలా అని చెప్పి తన కష్టార్జితమైన అవార్డులని వెనక్కి ఇచ్చేస్తాను అని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన వివరణ ఇచ్చాడు.