ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం కలెక్షన్స్ బాగా ఉన్నాయంటూ ఆ చిత్ర యూనిట్ చెబుతున్నది అలాగే ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ కలెక్షన్స్ సాధించనుంది అన్న వార్తల వస్తున్న నడుమ ఇప్పుడు ఒక కొత్త రకం పుకార్లు ఈ చిత్రం చుట్టూ మొదలయ్యాయి.
ఆ పుకార్ల సారాంశమేమిటంటే- ప్రస్తుతం జై లవకుశ యూనిట్ చెబుతున్న మేర కలెక్షన్స్ రావడం లేదని ఇంకా ఈ చిత్ర కలెక్షన్స్ సేఫ్ జోన్ లోకి రాలేదు అని వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక రేపు మహేష్ స్పైడర్ చిత్రం విడుదల కానుండడంతో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉన్నందున ఇటువంటి పుకార్లు చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఈ చిత్రాన్ని విడుదల చేసిన దిల్ రాజు సైతం ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ముందుంది అని ప్రకటించడం విశేషం. మొత్తానికి ఈ రెండు భిన్నరకమైన వార్తలతో సామాన్య ప్రేక్షకులు మాత్రం ఈ రెండిట్లో ఏది నిజమో కాదో అన్నది తెలియక తలలు పట్టుకుంటున్నారు.