యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'జై లవకుశ' . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కాబోతుంది. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, అక్కడ కూడా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది.
విదేశాల్లో సినిమా ప్రివ్యూ చూసి, రేటింగ్ ఇచ్చే సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు. ఆయన ఇండియాలో సినిమా రిలీజ్ లకి ముందే రివ్యూలు ఇస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమా 'జై లవకుశ' కి కూడా రివ్యూ ఇచ్చేసాడు.
దర్శకుడు బాబీ సినిమాని బాగా తీసాడని, స్టోరీ, స్క్రీన్ ప్లే లో చాలా మాస్ మూమెంట్స్ ఉన్నాయని తెలిపారు. సినిమా క్లెమాక్స్ బాగుందని, ఫైట్స్ అదిరిపోయాయని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్స్ నివేతా, రాశి ఖన్నా బాగా చేసారని, ఎన్టీఆర్ ని మూడు పాత్రల్లో చూడటం అభిమానులకి పండగలా ఉంటుందని, కొన్ని పాటల్లో ఎన్టీఆర్ డాన్స్ కి ఫాన్స్ ఫిదా అయిపోతారని కొనియాడాడు.
ఇక ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ డ్రామా ప్రేక్షకులని, అభిమానులని కట్టి పడేస్తుందని.. సినిమాలో కొన్ని చోట్ల సీన్లు చాలా లెన్తీ గా ఉన్నాయని, ఎడిటింగ్ కొంచెం బాగా చేసుంటే బాగుండేదని ఉమైర్ తెలిపారు. ఓవరాల్ గా 'జై లవకుశ' సూపర్ హిట్ అని, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అన్నారు. ఈ సినిమాకి 3.5/5 రేటింగ్ కూడా ఇచ్చారు.