నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం జై సింహ ఈ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాలో బాలయ్య వేసిన డ్యాన్సులకి అందరు ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా ఆయన అభిమానుల సంగతి అయితే వేరే చెప్పకర్లేదు.
ఇక మొదటిరోజు బాలయ్య తన చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి వసూళ్ళు సాధించాడో ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 7 కోట్ల (షేర్) కలెక్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా రూ 8.25 కోట్ల (షేర్) సాధించింది. దీన్నిబట్టి ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు సుమారు రూ 14-16 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి ఉండొచ్చు అని ఒక అంచనా.
ఇక వచ్చే మూడు నాలుగు రోజులు సెలవలు కావడంతో బాలయ్య సినిమాకి కలెక్షన్స్ మరింత ఊపందుకుంటాయి అన్న దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాలకి పెట్టింది పేరు కావడంతో సినిమాలని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అని చెప్పొచ్చు.
చూద్దాం.. బాలయ్య వచ్చే మూడు రోజుల్లో ఇంకెన్ని కోట్లు కొల్లగోడతాడో..